సింగరేణి వ్యాప్తంగా సిఐటియు నిర్వహిస్తున్న సొంత ఇంటి పథకం అమలు కోసం బ్యాలెట్ ఓటింగ్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారని సింగరేణి కాలరేస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం కొత్తగూడెం పివికే గనిలో నిర్వహించిన బ్యాలెట్ ఓటింగ్ లో సింగరేణి బొగ్గు బావుల వద్ద,అధికారుల కార్యాలయాల వద్ద గని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు