చంద్రశేఖరపురంలో ఈనెల ఏడవ తేదీన ప్రతిష్టాత్మకంగా సిఐటియు మండల మహాసభలను నిర్వహిస్తున్నట్లు సిఐటియు చంద్రశేఖరపురం మండల గౌరవ అధ్యక్షులు తిరుపతిరెడ్డి తెలిపారు. బుధవారం చంద్రశేఖరపురం సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..... ఏడవ తేదీన నిర్వహించు సిఐటియు మండల మహాసభలకు చంద్రశేఖరపురం మండలంలోని కార్మికులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.