యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు పట్టణ కేంద్రంలో భారీ వర్షానికి రంగనాయకుల ఆలయం, బ్రహ్మంగారి ఆలయం 11,12 వార్డుల సమీపంలోని బైరాం కుంట తెగి కుంట సమీపంలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం రాత్రి నీట మునిగిన ఇండ్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేసి తక్షణ సహాయం కింద వారిని ఆదుకోవాలని, అవసరమైతే వారిని ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. జెసిబి సహాయంతో వరద నీరును మళ్లించి కాలనీలలోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. అన్ని విధాలుగా ఆదుకొని శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.