పామూరు పట్టణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జనవిజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ చెన్న కృష్ణ మాట్లాడుతూ.... ఏపీలో మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలన్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్నారని, ఏపీతోపాటు మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని తీసుకురావాలన్నారు. విద్యార్థులు మూఢనమ్మకాలను విడనాడి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు.