గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నంగునూరు మండలంలోని వాగులు, చెక్ డ్యాం లు పొంగి పొర్లుతున్నాయి. ఇందులో భాగంగా నంగునూరు మండల పరిధిలోని మోయ తుమ్మెద వాగు ప్రవాహం బుధవారం ఎక్కువైంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలుకురుస్తున్ననందున వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.