చీరాల మండలం ఈపూరుపాలెం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడ్డారు. వారు స్కూటీపై వెళుతుండగా ముందు వెళుతున్న కారు సడన్ బ్రేక్ తో ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.కారును ఢీకొన్న స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్ లో వారిని ఆసుపత్రికి పంపారు.కేసు దర్యాప్తులో ఉంది.