అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి కర్నూలుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు గొడవ పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గుంతకల్లు నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలు గొడవకు దిగి బూతులు తిట్టుకున్నారు. తోటి ప్రయాణికులు సర్ది చెబుతున్నా వారు పట్టించుకోకుండా పరస్పరం బూతుల దండకం ఎత్తుకున్నారు. మహిళలు గొడవ పడుతున్న వీడియోను కొందరు ప్రయాణికులు తీసి వైరల్ చేశారు.