రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి బుధవారం చెరుకుపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గూడవల్లిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో ఎరువుల నిల్వలను పరిశీలించి, అనంతరం చెరుకుపల్లిలోని గ్రోమోర్ ఎరువుల దుకాణంలో స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. రైతులందరికీ సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, టోకెన్ సిస్టం ద్వారా రైతుల పాస్బుక్ ఆధారంగా ఎరువుల పంపిణీ జరుగుతుందని ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. రైతులు ఎవరో అధైర్య పడద్దని ఆర్డిఓ సూచించారు.