లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామ శివారులోని మల్లారం చెరువు కింద సాగుచేసిన పంటలకు నీటిని అందించేందుకు జల వనరుల శాఖ అధికారులు ఫీడర్ ఛానల్కు శనివారం నీటిని మళ్లించారు. జలవనరుల శాఖ డీఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మల్లారం చెరువు కట్ట తెగిపోవడంతో చెరువు కింద ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో రైతులు సాగుచేసిన పంటలకు నీటిని అందించేందుకు అడవి నుంచి వచ్చే నీటిని, ఎల్లారం చెరువు నుంచి వచ్చే నీటిని ఫీడర్ ఛానల్ ద్వారా మల్లారం చెరువులో కాలువ తూము వరకు కలిపారు. ఫీడర్ ఛానల్ ద్వారా నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.