సమగ్ర శిక్ష మరియు ఆలింకో ఆధ్వర్యంలో 18 సంవత్సరాల లోపు దివ్యాంగుల కొరకు నిర్వహించబడుతున్న ప్రత్యేక నిర్ధారణ శిబిరాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ శనివారం ZPHS. ఆనందఖని, కొత్తగూడెం నందు సందర్శించారు.దివ్యాంగ బాలలను, తల్లిదండ్రులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,దివ్యాంగులు అంటే ఏదో అవయవాలు లోపం ఉన్నవారు కాదని, ప్రతి ఒక్క దివ్యాంగుడిలో కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుందని ఆ సామర్థ్యాలను గుర్తించి,వారిని భవిష్యత్తులో రాణించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు.