ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోగల పాల్వంచలోని నవభారత్ లో గల మైనారిటీ గురుకుల కళాశాల నందు బాలుర కొరకు,ఖమ్మంలోని రాపర్తినగర్ లో గల బాలికల కళాశాలలో బాలికలకు ఈ విద్యా సంవత్సరం నుండి సీఓఈ కళాశాలలను మంజూరు చేయడం పట్ల మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం నాడు హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కళాశాలకు దీటుగా మైనారిటీ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని ఉద్దేశంతో నీట్,జేఈఈ మెయిన్స్ పరీక్షలలో శిక్షణ అందించి వారిని డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫీఉల్లా నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.