పలమనేరు: నాగమంగళం కేటల్ ఫారం కౌండిన్య నది బ్రిడ్జిపై స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. కుప్పం నుండి పలమనేరు వైపు ఆపిల్ లోడ్ తో ఆటోలో వస్తుండగా బెంగళూరు వైపు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ కంటైనర్ ఆటోను వెనుక నుండి ఢీకొని ఆపకుండా వెళ్లిపోయిందని తెలిపారు. కాగా ఈ ఘటనలో ఆటో ముందు భాగం నుజ్జయింది,డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు ఆగి డ్రైవర్ను ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకోమని కోరగా, నా ఆపిల్ కాయలను ఎవరైనా తీసుకెళ్లిపోతారన్న మా వాళ్లకు ఫోన్ చేసాను వారు వచ్చిన తర్వాత వెళ్తానని తెలిపారు.