పనుల జాతర కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సీతారాంపూర్, సుందరగిరి గ్రామాలలో పలు అభివృద్ధి పనులను మంత్రి పోన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. సీతారాంపూర్ లో 5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీతారాంపూర్ నుంచి పర్లపల్లి బీటీ రోడ్డు ను ప్రారంభించారు. అనంతరం సుందరగిరి ఎసి కాలనీలో 10 లక్షల రూపాయల తో సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు ను అందించారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న మూడు జిల్లాల పరిధిలో 46 మండలాలలో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.