గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తొగుట మండలంలోని చందాపూర్, రాంపూర్, వాగు గడ్డ, ప్రాంతంలో కూడవెళ్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రోడ్డుపైకి పైనుండి వెళుతున్న నీటి ప్రవాహాన్ని గురువారం క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంబంధిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.ఎక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని తెలిపారు. అవసరమైన చోట ఎస్డిఆర్ఎఫ్ బృందాల సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాలలో రోడ్లను బ్లాక్ చేయాలని సూచించారు. ప్రజలు ప్రయాణిక