గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు గ్రామంలో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్కెళ్ళపాడులో ఆదివారం స్థానికులతో మాట్లాడిన ఆయన, విగ్రహావిష్కరణను నిలిపివేయాలని కోరారు. విగ్రహావిష్కరణకు స్థానికులు ఏర్పాట్లు చేయడంతో విషయాన్ని తెలుసుకున్న బీసీ సంఘం నేతలందరూ తక్కెళ్ళపాడు గ్రామానికి వెళ్తున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు మేము వ్యతిరేకులం కాదు కానీ కృష్ణుడు రూపంలో ఉండడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని రామచంద్ర యాదవ్ తెలిపారు.