అదిలాబాద్ మీదుగా కంటైనర్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్టు తలమడుగు పోలీసులకు అందిన సమాచారం మేరకు లక్ష్మీపూర్ రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద కంటైనర్ను వెంబడించి పట్టుకున్నారు.. కంటైనర్ లో 9 క్వింటాళ్లు సుమారు 2 కోట్ల 25 లక్షల పైగా గంజాయి లభ్యం కావడం, గంజాయి స్వాధీనం చేసుకొని 8 మందిపై కేసు నమోదు చేయగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు..