కనిగిరి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా అద్దంకి రంగబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు డైరెక్టర్లుగా షేక్ బారా ఇమామ్, వెంకటసుబ్బయ్యలు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ అద్దంకి రంగబాబు మాట్లాడుతూ.... కనిగిరి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయడంతో పాటు, ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాలను వారికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.