ప్రతిష్ఠాత్మక బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. దీన్ని కర్మనఘాట్కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలాపూర్ లడ్డూ అంటే ఎంతో ఇష్టం. దీని కోసం ఆరేళ్లుగా ప్రయత్నిస్తే భగవంతుడి దయతో ఈ ఏడాది దక్కిందని పేర్కొన్నారు.