రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు రామసముద్రం మండలంలో శనివారం మధ్యాహ్నం బైక్ అదుపు తప్పి పడి ఓ స్కూటిరిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఆర్.నడింపల్లి పంచాయతి, దిగువబొంపల్లికి చెందిన సురేంద్ర (25) పొరుగు గ్రామం మిట్టపల్లికి బైక్ లో వెళుతూ దారిలో అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో సురేంద్రకు తీవ్ర రక్త గాయాలు కావడంతో స్థానికులు 108లో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి తిరుపతికి వెళ్లాలని డాక్టర్లు రుయాకు రెఫర్ చేయగా వారు అతన్ని తిరుపతికి తీసుకెళ్లారు.