గ్రామ పరిపాలన అధికారులుగా ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం ఐదు గంటలకు సిసిఎల్ఏ మరియు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్ మాట్లాడుతూ భూభారతి చట్టం అమలులో భాగంగా జిపిఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరీక్ష నిర్వహించిందని తెలిపారు. అందులో భాగంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఈనెల ఐదున ఇవ్వనున్నామన్నారు. దానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.