స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వస్థ నారి శసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంపై (ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం) సంబంధిత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వస్థ నారి శసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు.