గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ఇటీవల జరిగిన వరుస మరణాల నేపథ్యంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శుక్రవారం ఆ గ్రామంలో పర్యటించారు. గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆయన సందర్శించి, అనారోగ్యంతో ఉన్న వారి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్య లు తీసుకోవాలని వైద్యులకు సూచించారు.