కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్. బి. అంజాద్ బాషా మాట్లాడుతూ 15 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పెట్టని తను జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 12 మెడికల్ కాలేజ్ మాత్రమే నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రాగానే 15 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి అన్నారు.