మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు లారీ డ్రైవర్లపై దాడి చేసిన ఘటన మంగళవారం మధ్యాహ్నం 2:00 లకు వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటనలో ఒక డ్రైవర్ గాయపడ్డాడు. జాతీయ రహదారిపై వాహనాలను అడ్డగించి, లైసెన్స్, పర్మిట్ చూపాలని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసారన్నారు.. ప్రతిఘటించిన డ్రైవర్పై రాళ్లతో దాడి చేసి, లారీ అద్దాలను పగలగొట్టారని తెలిపారు..బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. బాధితులు న్యాయం చేయాలని కోరారు.