రాష్ట్రంలో మద్యం సరఫరా చేయడంలో ఉన్న ధ్యాస యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వానికి లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం పాస్ బుక్ లతో రైతులు క్యూ లైన్ లో గంటలు తరబడి నిలబడిన యూరియా దొరకని పరిస్థితి ఉందన్నారు. రైతులు ఖాళీ మద్యం సీసా పాస్ బుక్ ల పై పెట్టి నిరసన వ్యక్తం చేశారు. యూరియా దొరకని రైతులు శనివారం అధికారులను రైతు వేదికలో బంధించారు. దీంతో రైతు వేదిక వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదిక వద్ద యూరియా వచ్చిందని తెలవడంతో, ఉదయం నాలుగు గంటల నుండి రైతులు పాసుబుక్కులు లైన్లో పెట్టి క్యూ కట్టారు. కొంత