కనిగిరి పట్టణంలోని బొగ్గుల గుంది గిరిజన కాలనీలో బాల్యవివాహాలు వాటి వల్ల కలిగే అనర్ధాలపై మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.... అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు వచ్చేవరకు వివాహాలను జరిపించరాదన్నారు. బాల్య వివాహాలు జరపడం వల్ల బాలికలు పలు అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. బాల్యవివాహాలను ప్రోత్సహించినా, జరిపించినా న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించడంతోపాటు, జైలుకు కూడా పంపుతాయని హెచ్చరించారు.