ఎడపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన అన్ని పార్టీల నాయకులతో ఎంపీడీవో శంకర్ నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఇప్పటికే ఓటర్ జాబితాను పంపించడం జరిగిందని, వాటిలో ఏమైనా తప్పిదాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అనేక తప్పిదాలు జరిగాయని, వాటిని వెంటనే సరిచేయాలని కోరారు.ఎడపల్లి గ్రామపంచాయతీ పరిధిలోనే 500 నుండి 800 వరకు దొంగ ఓట్లు నమోదయ్యాయని, విచారణ జరిపి వెంటనే వాటిని తొలగించాలని బిజెపి నాయకుడు కందగట్ల రాంచందర్ అన్నారు.