గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం గడువు పెంచాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. చాలా గ్రామాల్లో ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేయడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ గడువు పెంచాలని, తాత్కాలికంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు.