చీమకుర్తి మండల సిఐటియు 6వ మహాసభలు ఆదివారం చీమకుర్తిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు కే సుబ్బారావు మాట్లాడుతూ.... కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాల స్థలంలో లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికుల పొట్ట కొట్టే విధానాలకు పాల్పడుతుందన్నారు. కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. కార్మికులు తమ సమస్యల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేయాలన్నారు.