జనసేన పార్టీ కోసం పని చేసిన ప్రతిఒక్కరికి తగిన గుర్తింపు వస్తుందని, పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐసీసీ) డైరెక్టర్ గా నియమితులైన జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్ ను శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన, టిడిపి నాయకులు అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉందని అన్నారు.