ఎవ్వరూ ఊహించని విధంగా ఈనెల 14న తిరుమలగిరిలో "సీఎం రేవంత్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం తిరుమలగిరిలో సభ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. గత పాలకులు పేదల సంక్షేమం కోసం ఏ పథకం చేయలేదని, పేదవారికి నూతన రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఒక సామాన్య కార్యకర్త అయిన తాను మంత్రిగా అవుతానని ఊహించలేదని, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానన్నారు.