చీరాల నియోజకవర్గంలో కొత్తగా మరో 28 పోలింగ్ బూత్ ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు చెప్పారు.శనివారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 218 పోలింగ్ బూత్ లు ఉండగా ఓటర్ల పెరుగుదల వల్ల అదనపు పోలింగ్ బూత్ ల ఏర్పాటు ఆవశ్యకత ఉందన్నారు.ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపుతామని ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు చెప్పారు.