Download Now Banner

This browser does not support the video element.

పాడేరు మండలంలోని చింతలవీధిలో భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం..ఒకరు మృతి..మరో ముగ్గురి పరిస్థితి విషమం

Paderu, Alluri Sitharama Raju | Aug 31, 2025
పాడేరు మండలంలోని చింతలవీధి జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయకుని నిమజ్జనం కోసం స్థానికులు ఊరేగింపుగా వెళ్తుండగా, అతి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం వారి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీతారామ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us