ఈత కొట్టేందుకు కొమ్మమూరు కాలువలో దిగిన వ్యక్తి నీట మునిగి మరణించిన ఘటన కారంచేడులో గురువారం జరిగింది.కారంచేడు కే చెందిన దగ్గుబాటి హరిప్రసాద్ కు ఈత కొట్టడం హాబీ.ప్రతిరోజూ ఆయన కొమ్మమూరు కాలువలో ఈత కొడతాడు.గురువారం కూడా ఈత కొడుతుండగా నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది స్పీడ్ బోటు సాయంతో కాలువలో గాలించి సాయంత్రం ఐదు గంటల సమయానికి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు.