1975లో అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విశాఖలో ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ ప్రచార దినాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటలకు ద్వారక నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం జిల్లాల కమిటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ మానవ హక్కుల వేదిక ఏపీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త కృష్ణ భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్మూర్తి రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రతినిధి పద్మ తదితరులు పాల్గొన్