రాష్ట్రంలో అర్హులైన వారి పింఛన్లు తొలగించడంపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో తొలగించిన దివ్యాంగుల పింఛన్లను పునరుద్దించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం వికలాంగులతో కలిసి రోడ్డుపై రాస్తారోకో చేసి అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పింఛన్లు లక్షకు పైగా తొలగిస్తూ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు.