నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడాలో గల ST హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షుడు ఇందల్ నాయక్ డిమాండ్ చేశారు. హాస్టల్‌ను బంజారా సేవా సంఘం నాయకులు పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థులకు సౌకర్యాలు లేవని ఆరోపించారు. విద్యార్థులకు వడ్డించే చారు నీళ్లు మాదిరిగా ఉందని, బెడ్లు సరిగా లేవని, బాత్రూం డోర్లు విరిగిపోయాయన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.