గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెంలో గత కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తురకపాలెంలో గాలిలో పొల్యూషన్ ఎంత ఉంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు మంగళవారం ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఎయిర్ పొల్యూషన్ పై ఒక పరికరాన్ని సైతం గ్రామంలో ఏర్పాటు చేశారు. ఎయిర్ పొల్యూషన్ ఎంతుందనేదాన్ని ఈ యంత్రాంగం గుర్తిస్తుంది.