తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతో చికిత్సలను అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మాతృ, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులు, బాధిత కుటుంబాల సమక్షంలో వైద్య సిబ్బందితో సమీక్షించడం జరిగింది. జిల్లాలో ఈ సంవత్సరం జూలై నెలాఖరు వరకు ఆసుపత్రులలో రెండు మాతృ మరణాలు, నాలుగు శిశుమరణాలు నమోదుపై సమీక్షించారు.