ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యూరు మండలంలోని రత్నంపేట, పాడి గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోందని సీఐ బీ.శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తోన్న సమయంలో ఎవరూ సాహసించి వాగును దాటవద్దని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో వాగు దగ్గర పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.