అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని జక్కలచెరువు గ్రామ శివారులో శనివారం వేకువజామున రైలు కింద పడి తమిమ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తి జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తమిమ్ అహ్మద్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కుటుంబసమస్యలతో పాటుగా అనారోగ్యసమస్యలతో బాధ పడుతుండే వాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు ఇంటి నుంచి వచ్చేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.