నిండు నూరేళ్లు నీ తోడు ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేసిన భర్తే భార్యను కడతేర్చాడు శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు ఎస్సీ కాలనీలో భర్త చేతిలో భార్య హత్యకు గురిఅయింది తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని నిత్యం భార్యతో వేధింపులు చేసి గొడవపడే వారన్నారు ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాఘవేంద్ర భార్య లక్ష్మీదేవి పై గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న రాఘవేంద్ర భార్య లక్ష్మీదేవి పై గుడ్డలతో దాడి చేయడంతో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని బాగేపల్లి ఆసుపత్రికి ఉదయాన్నే తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.