భర్త టార్చర్ భరించలేక భార్య ఆత్మహత్యాయత్నం భర్త పెట్టే టార్చర్ భరించలేక భార్య విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కురబలకోట మండలంలో మంగళవారం ఉదయం10కి వెలుగుచూసిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని అంగళ్లులో కాపురం ఉంటున్న ఎం.బాలరాజు తన భార్య వరలక్ష్మి(18)పై అనుమానం పెంచుకొన్నాడు. మధ్యం తాగొచ్చి రోజు భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలి కుటుంబీకులు ఆరోపించారు. దీంతో జీవితంపై విరక్తిచెందిన వరలక్ష్మి విషం తాగి ఆత్మహత్యా యత్నంకు పాల్పడగా వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా నెల రోజులక్రితం ఈమె తమ్ముడు మృతి చెందాడు