నల్గొండ జిల్లా త్రిపురారం మండల పరిధిలోని బాబు సాయి పేట గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగు ఉప్పొంగడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. మూడు కోట్ల జయంతో చేజెక్కించుకున్న గుత్తేదారు పనులు సగంలోనే వదిలి వేయడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు వాహనదారులు, పదచారులు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ MLA భక్తుల లక్ష్మారెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డిలు పరిశీలించారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలావుంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాగు ఉప్పొంగే ప్రమాదం ఉందని వాగు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిక బోర్డులను ఏర్పాటుచేశారు