హుస్నాబాద్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్లమ్మ చెరువు పూర్తిగా నిండిన సందర్భంగా శుక్రవారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు అన్ని పూర్తిగా నిండాయని ఆ గంగమ్మ తల్లి అందరిని చల్లగా చూసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనుల గూర్చి ఆరా తీసి బతుకమ్మ పండుగ వరకు బతుకమ్మ గార్డ్ పూర్తి చెయ్యాలని పనుల్లో వేగం పెంచి నిర్ణిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.