అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 35 లక్షలు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాధితుడు వజ్రకరూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ నాగ స్వామి సోమవారం పేర్కొన్నారు. ఆన్లైన్ పార్ట్ టైం ఉద్యోగం పేరిట టెలిగ్రామ్ యాప్ లో లింక్ పంపి తన బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయించుకుని విడతల వారీగా సుమారు 35 లక్షలు మోసపోయానని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.