యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, కాచారం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెన్షన్ దారులతో మంగళవారం సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బిరు మహేందర్ మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం చేయుత పెన్షన్లు రూ.4 వేలు, వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 50 లక్షల మంది పెన్షన్ దారులతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని హెచ్చరించారు.