బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు- నాగలాపురం మద్య HLC ప్రధాన కాలువకు గండిపడిన ప్రదేశంలో అధికారులు యుద్ద ప్రాతిపదికన మరమత్తు పనులు చేపట్టారు. MLA కాలవశ్రీనివాసులు ఆదేశాలతో నీటి ప్రవాహం తగ్గించి DE మద్దిలేటి, AEE ఆల్తాఫ్ ల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ శ్రమించి JCB సహాయంతో గండిపడిన చోట పూడ్చివేత పనులు చేపట్టారు. మట్టితో కప్పి తాత్కాలికంగా గండి పూడ్చేశారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.