నంద్యాల జిల్లా నందికొట్కూరు జాతీయ స్థాయిలో AICCTU, కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదివారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిక్కలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు, అనంతరం సమ్మెకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. అసంఘటిత రంగాల్లో పనిచేసే హమాలీలు, ఆటో కార్మికులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన వండాళ్లు వంటి వారు కనీస వేతనాలతో జీవిస్తున్నారు