జిల్లాలో నేటి నుంచి స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు: అమలాపురంలో
సమగ్ర శిక్షా జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మమ్మీ
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నేటి నుంచి 15 రోజుల పాటు 'స్వచ్ఛతా పక్వాడా' కార్యక్రమాలు జరుగుతాయని సమగ్ర శిక్షా జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ, సీఎంవో బి.వి.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. అమలాపురం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల పరిసరాలతో పాటు తమ ఇళ్లను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.